CV Anand: సీఎం రేవంత్ రెడ్డితో సీవీ ఆనంద్ భేటీ

by Prasad Jukanti |   (  Updated:2025-05-17 10:44:16  IST  )

సీఎం రేవంత్ రెడ్డిని సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

CV Anand: సీఎం రేవంత్ రెడ్డితో సీవీ ఆనంద్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) కలిశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇటీవల ఎక్సలెన్స్ యాంటీ నార్కోటిక్స్ అవార్డును సీవీ ఆనంద్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎంను సీవీ ఆనందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలవడంపై ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ను ముఖ్యమంత్రి అభినందించారు.

Next Story