CV Anand: 4 ప్రాంతాలు.. 2 నిమిషాల పాటు సైరన్.. హైదరాబాద్ లో మాక్ డ్రిల్ పై సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

హైదరాబాద్ లో మాక్ డ్రిల్ పై సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

CV Anand: 4 ప్రాంతాలు.. 2 నిమిషాల  పాటు సైరన్.. హైదరాబాద్ లో మాక్ డ్రిల్ పై సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ (mock drills) నిర్వహించబోతున్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV ANAND) అన్నారు. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్డీవో, మౌలాలిలోని ఎన్ఎఫ్ సీలో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. 15 నిమిషాల పాటు మాక్ డ్రిల్ కొనసాగుతుందని తెలిపారు. ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, ఎన్డీఆర్ఫ్, ఎస్ డీఆర్ఫ్ రెస్క్యూ రిహార్సల్ చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన సాయంత్రం 4 గంటలకు ఐసీసీసీ నుంచి జీహెచ్ఎంసీ ప్రాంతానికి మెసేజ్ వెళ్తుంది. 2 నిమిషాల పాటు సైరన్ మోగుతుంది. సైరన్ మోగిన తర్వాత ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తామన్నారు. సైరన్ మోగిన తర్వాత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బయటకు రావొద్దని సూచించారు. ఒక వేళ బయట ఉన్నవాళ్లు సురక్షిత నిర్మాణాల్లోకి వెళ్లాలన్నారు. మాక్ డ్రిల్ పై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారని తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పని లేదని అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన విధానంపై అవగాహన కోసమే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో చాలా రక్షణ సంస్థలు ఉన్నాయి. కేంద్ర రక్షణ సంస్థళు ఉన్నందున ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లో ఉన్న పాకిస్థాన్ పౌరులను దేశం నుంచి పంపించే ప్రక్రియ కొనసాగుతోందని బంగ్లాదేశ్ పౌరులను కూడా గుర్తించి పంపించే చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story