- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CV Anand: హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
by Prasad Jukanti |
హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (Home Department Special Chief Secretary) సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామృకృష్ణరావును మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీవీ ఆనంద్‍కు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం పలువురు ఐపీఎస్, ఐఏఎస్‍లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ సిటీ సీపీగా విధులు నిర్వహించిన సీవీ ఆనంద్‍ను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేయగా ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన రవి గుప్తాకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఎగ్జిక్యూటీవ్ వైస్ చైర్మన్‍గా బాధ్యతలు అప్పగించింది.
Next Story






