- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: టీచర్ల జీతాలకు కోత?.. విద్యా కమిషన్ సిఫార్సుపై ప్రభుత్వం క్లారిటీ
విద్యా కమిషన్ నివేదికపై ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఖండించారు. టీచర్ల జీతాలపై ఆయన స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా కమిషన్‍పై (Education Commission) తెలిసి తెలియక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు (K.Keshav Rao) అన్నారు. చాలా మందిని కన్సల్ట్ అయ్యాకే కమిషన్ రిపోర్టు తయారు చేసిందని అన్నారు. విద్యాకమిషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమల్లోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యా కమిషన్ నివేదికపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. టీచర్ల జీతాల (Teachers Salaries) వివాదంపై స్పందిస్తూ సమాజంలోని విద్యార్థులు దారిప్పిపోకుండా వారిని ప్రయోజకులను చేస్తున్న ఉపాధ్యాయుల సేవలకు విలువ కట్టలేమని అన్నారు. ఉపాధ్యాయుల జీతాల అంశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. విద్యా కమిషన్‌లో అసలైన విద్యావేత్తలు ఉన్నారా? సూల్, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఒక్కరైనా ఉన్నారని చెప్పగలరా? అని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కేశవరావు ఖండించారు. కమిషన్ లో విద్యావేత్తలు ఎందుకు లేరని ప్రశ్నించారు.
కమిషన్ సిఫార్సుపై విమర్శలు:
ఆకునూరి మురళి కమిషన్ ప్రభుత్వానికి సమర్పించి సిఫార్సుల్లో టీచర్లు, అధ్యాపకుల జీతాల అంశం వివాదాస్పదం అయింది. టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు అధికంగా ఉన్నాయని, వీటిని రాబోయే రోజుల్లో హేతుబద్ధీకరించాలని కమిషన్ అభిప్రాయపడింది. ఈ సిఫార్సుపై ప్రతిపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన కేశవరావు జీతాల అంశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు.






