- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్ సిలిండర్ల కొరత.. మెనూలో కోత పెడుతున్న హోటళ్లు.. త్వరలో హాస్టల్స్ క్లోజ్!
కమర్షియల్ ఎల్పీజీ కొరత ఏర్పడింది. పలు హోటళ్లు మూతపడుతుండగా, పీజీలు, హాస్టళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ యుద్ధం భారత్‌లో చమురు, గ్యాస్ విషయంలో టెన్షన్ పెట్టిస్తోంది. పలు ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఒక్క ముంబయి లోనే 20 శాతం హోటళ్లు మూత పడగా స్టాక్ ఉన్న హోటళ్లు పొదుపుగా వాడుకునేందుకు హోటల్స్ తమ మెనూలో కోతలు విధిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా బెంగళూరులో ఒక హోటల్ మార్చి 10వ తేదీన కేవలం కాఫీ, టీ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు బోర్టు ఏర్పాటు చేసింది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా రేపటి నుంచి రెస్టారెంట్లు బంద్ చేస్తున్న్టలు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
కట్టెల పొయ్యిల ఏర్పాటు:
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా పలు హోటళ్లు మళ్లీ కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నాయి. బెంగళూరులోని గాంధీ నగర్ ప్రాంతంలో ఉన్న మజెస్టిక్‌లోని రేస్‌కోర్స్ సమీపంలో ఉన్న సాంక్చువరీ 3 స్టార్ హోటల్ కట్టెల పొయ్యిపై ఆహార పదార్థాలను వండుతోంది. ఇందుకు సంబంధించి రెస్టారెంట్ లోకి కట్టెలు తరలిస్తున్న వీడియో వైరల్ గా మారింది.
పీజీలు బంద్?:
ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం హాస్టల్స్, పీజీలపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బోటళ్లు, రెస్టారెంట్లు మూసివేస్తామని ఆయా అసోసియేషన్లు ప్రకటిస్తున్న తురణంలో హాస్టల్స్ & పీజీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పీజీలు ఎక్కువగా ఉండే బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో వాటి యజమానులు ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ సిలిండర్ల విషయంల ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోకుంటే హాస్టళ్లతో పాటు ఆసుపత్రులు, రైల్వే క్యాంటీన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు.






