లక్షలు పెట్టి కొన్నా.. ఫోన్ సమస్య! One Plus ఫోన్ షోరూమ్ వద్ద కస్టమర్ ఆందోళన

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ వన్ ప్లస్ ఫోన్ సర్వీస్ సెంటర్‌లో ఓ కస్టమర్ ఆందోళనకు దిగాడు.

లక్షలు పెట్టి కొన్నా.. ఫోన్ సమస్య! One Plus ఫోన్ షోరూమ్ వద్ద కస్టమర్ ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని (Himayat Nagar One Plus phone showroom) హిమాయత్‌నగర్ వన్ ప్లస్ ఫోన్ సర్వీస్ సెంటర్‌లో ఓ కస్టమర్ ఆందోళనకు దిగాడు. రిపేరింగ్ చేస్తామని చెప్పి నెలలు తరబడి రిపేరింగ్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి తన ఫోన్ పెట్టుకొని ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు అని సర్వీస్ సెంటర్ చేతులెత్తేసిందని ఓ కస్టమర్ ఆరోపణలు చేశారు. తమ సమస్యపై వన్ ప్లస్ సర్వీస్ సెంటర్ మేనేజర్‌ను ప్రశ్నించగా.. కష్టమర్లపై దురుసుగా ప్రవర్తించడం, పోలీసులను పిలిచి బెదిరించడం చేస్తున్నారని ఓ కస్టమర్ ఆరోపించారు. గట్టిగా ప్రశ్నిస్తే ఫోన్ రిపేర్ కాదని, అదే కంపెనీకి చెందిన కొత్త ఫోన్ ఇస్తానన్నాడు కానీ వారెంటీ ఇవ్వనని చెబుతున్నట్లు ఆరోపించారు.

వారెంటీ లేని ఫోన్ తీసుకొని వెళ్లాక మరేమైనా సాంకేతిక సమస్య తలెత్తితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదని సిబ్బంది చెబతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే లక్షలు పెట్టి కొన్న ఫోన్‌ల సాంకేతిక సమష్యాలు పరిష్కరించని వన్ ప్లస్‌ను బ్యాన్ చేయాలని కస్టమర్ డిమాండ్ చేశారు. మోసపోయిన కస్టమర్లకు కంపెనీ నుంచి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కస్టమర్ విజ్ఞప్తి చేశారు. కాగా, హిమాయత్ నగర్ వన్ ప్లస్ సర్వీస్ సెంటర్‌లో ప్రతిరోజు వందలాది మంది వన్ ప్లస్ 9 ప్రో వినియోగదారుల ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.

Next Story