- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCA కేసులో ముగిసిన నిందితుల కస్టడీ.. విచారణలో కీలక విషయాలు గుర్తించిన సీఐడీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అక్రమాల కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అక్రమాల కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగిసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, ట్రెజరరి శ్రీనివాస్ రావు, కోశాధికారి సీజే శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్‌యాదవ్, అతని భార్య, క్లబ్ అధ్యక్షురాలైన కవితను (CID) సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. 6 రోజుల పాటు నిందితులను తెలంగాణ సీఐడీ అధికారులు విచారించారు. నిందితుల కస్టడీ నేటితో ముగిసింది. దీంతో నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మల్కాజిగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచి.. తిరిగి జైలుకు పంపించనున్నారు. కస్టడీలో నిందితుల నుంచి అనేక విషయాలను సీఐడీ రాబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా జగన్ మోహన్‌రావు అక్రమంగా ఎన్నికయ్యడని సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. హెచ్‌సీఏ నిధుల మళ్లింపుపైనా దర్యాప్తు కొనసాగుతోంది.






