ఇదెక్కడి ఐడియారా బాబు.. చిటారు కొమ్మల్లో గంజాయి మొక్కల సాగు

by Prasad Jukanti |

పొలీసుల కళ్లు గప్పి గంజాయి సాగు చేసేందుకు కేటుగాళ్లు వెరైటీ ఆలోచనలు చేస్తున్నారు.

ఇదెక్కడి ఐడియారా బాబు.. చిటారు కొమ్మల్లో గంజాయి మొక్కల సాగు
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలో గంజాయి వినియోగం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఈ మత్తు పదార్థాల వల్ల యువత తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. దీంతో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంన్నారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి వెరైటీగా పంట పొలాల్లో గంజాయి సాగుచేయడం ప్రారంభించారు. అయితే ఈ తరహా సాగును సైతం పోలీసులు గుర్తించడంతో కేటుగాళ్లు మరింత అడ్వాన్స్ గా ఆలోచన చేస్తు వింత ఐడియాలు సృష్టిస్తున్నారు. మిగతా వారిలా గంజాయి సాగు చేస్తే దొరికిపోతామనుకున్నారో ఏమో కానీ నిర్మల్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో కొంత మంది వెరైటీగా ఆలోచన చేశారు. ఏకంగా చెట్టు కొమ్మలకు ప్లాస్టిక్ డబ్బాలను ఏర్పాటు చేసి వాటిని మట్టితో నింపి అందులో గంజాయి మొక్కలను పెంచుతున్నారు. మండల కేంద్రంలోని సాయి నగర్ ను ఆనుకుని ఉన్న ఓ వెంచర్ గంజాయి మొక్కలను ఇలా వెరైటీగా సాగుచేస్తున్న నిర్వాకం తాజాగా బయటపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఇదెక్కడి ఐడియాలురా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటే ఇదేనమో అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Next Story