ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన CTD

by Malleboina Mahesh |

ఇటీవల పలు బాంబు దాడుల్లో పాల్గొన్న ఇద్దరు కీలక ఉగ్రవాదులతో పాటు మరో ఆఫ్ఘన్ టెర్రిరిస్ట్ హతమయ్యారు.

ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన CTD
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పలు బాంబు దాడుల్లో పాల్గొన్న ఇద్దరు కీలక ఉగ్రవాదుల (Terrorists)తో పాటు మరో ఆఫ్ఘన్ టెర్రిరిస్ట్ హతమయ్యారు. పాకిస్థాన్ వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వా లో శుక్రవారం రాత్రి భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్‌ (A special operation) నిర్వహించారు. ఇందులో ఒక ఆఫ్ఘన్ జాతీయుడు సహా ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) తెలిపింది. మరణించిన ముగ్గురు ఉగ్రవాదులలో ఇద్దరు పెషావర్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో పాల్గొన్నారని తెలిపింది. నిఘా ఆధారిత ఆపరేషన్ (IBO) ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ జిల్లాలో నిర్వహించబడిందని ఆ విభాగం ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ ఆపరేషన్ కొనసాగుతోందని, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అధికారులు తెలిపారు.

Next Story