- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ఆదేశాలు.. కేంద్రానికి సీఎస్ ఘాటు లేఖ
రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ బుధవారం (16 వ తేదీ) రోజున ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్ల(Banakacharla)ను ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ బుధవారం (16 వ తేదీ) రోజున ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్ల(Banakacharla)ను ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం ఏమాత్రం లేదని, వెంటనే ఆ ఎజెండాను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు(CS Ramakrishna Rao) కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలు అన్నింటినీ ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏఐబీపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన ఎజెండా ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పంపించింది.
బనకచర్లపై GRMB, CWC, ఈఏసీ తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని, ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే Banakacharla ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ఈ లేఖలో ప్రస్తావించింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో ప్రస్తావించింది. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని ఈ లేఖలో ఉటంకించింది.
కేంద్ర జల సంఘం కూడా ప్రీ- ఫీజిబులిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని, తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చేసింది.






