Cabinet Meeting: ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయం!.. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ

by Prasad Jukanti |   (  Updated:2025-06-03 10:49:31  IST  )

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతున్నది.

Cabinet Meeting: ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయం!.. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ మంత్రివర్గం (Telangana Cabinet) ఎల్లుండి సమావేశం కానుంది. జూన్ 5న మధ్యహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో (TG Secretariat) కేబినెట్ భేటీ కాబోతున్నది. ఈ మేరకు సీఎస్ (CS) కె.రామకృష్ణ రావు ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాజీవ్ యువవికాసం, వానాకాలంలో పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లతో పాటు కాళేశ్వరం అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టు పై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ నివేదికను సీఎం మంత్రులకు భట్టి విక్రమార్క ఇప్పటికే వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కేబినెట్ లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నదని అనేది ఉత్కంఠగా మారింది. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కేబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Next Story