Chukka Ramaiah: మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నివాసానికి సీఎస్ శాంతి కుమారి

by Prasad Jukanti |

మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నివాసానికి సీఎస్ శాంతికుమారి వెళ్లారు.

Chukka Ramaiah: మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నివాసానికి సీఎస్ శాంతి కుమారి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య (Chukka Ramaiah) నివాసానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanti Kumari) వెళ్లారు. ఇవాళ చుక్కా రామయ్య పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చేత సీఎస్ కేక్ కట్ చేయించారు. పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చుక్కారామయ్య నివాసానికి వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పారు.

గతంలో సీఎం పరామర్శ:

గత కొంత కాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత మే లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. చుక్కా రామయ్యను సత్కరించి జూన్ 2న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించి వచ్చారు.

Next Story