- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెను ప్రమాదం నుండి బయటపడ్డట్టే.. తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రకటన
భారీ వర్షాలు(Heavy Rain), వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు(CS Ramakrishna Rao) వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు(Heavy Rain), వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు(CS Ramakrishna Rao) వెల్లడించారు. భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ.. గత 24 గంటలలో అత్యంత భారీ వర్షాలు కురిసిన్నప్పటికీ, పాలనా యంత్రాంగం సకాలంలో చేపట్టిన చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని అన్నారు. నేడు కూడా వర్షాలు పడే అవకాశమున్నందున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు అవసరమైతే SDRF ,NDRF బృందాలను పంపిస్తామని తెలిపారు. పోచారం జలాశయానికి నీటి ఇన్-ఫ్లో తగ్గినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుండి బయట పడ్డట్టే అని నీటి పారుదల శాఖ అధికారులు తెలియచేశారు. వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. SRSP నుండి మూడు లక్షల క్యూసెక్కుల జలాలను, నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుండి లక్షా 90 వేలక్యూసెక్కుల జలాలను వదులుతున్నందున, దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. కల్వర్టులు, పొంగుతున్న వాగులు, లోతట్టు ప్రాంతాల వద్ద తగు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి, ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలనుండి పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి తగు ఆహారం, మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలను అందించాలని అన్నారు. వర్షాల వాళ్ళ దెబ్బతిన్న విధ్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పునరుద్దరించాలన్నారు.






