- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్! క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ దిశగా ఈహెచ్ఎస్.. సీఎస్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) విధి విధానాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) విధి విధానాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (Ramakrishna Rao) ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత EHS విధి విధానాలపై సీఎం ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు సోమవారం సచివాలయం సీనియర్ ఐఏఎస్ అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలవుతున్న వివిధ పథకాలను, ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుంచి కొంత డబ్బును జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు.
నగదు రహిత ఆరోగ్య చికిత్స విధానం ద్వారా (Cashless Treatment) ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కేర్ అందించాలని ఉద్యోగులు కోరుతున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం కలిపి 7 లక్షల 14 వేల 322 మంది EHS ద్వారా లబ్ధి పొందనున్నారని సీఎస్ దృష్టికి తీసుకుపోయారు. ఈ పథకం కోసం ఏడాదికి సుమారు రూ.1300 కోట్ల మేర వ్యయం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న EHS విధి విధానాలను అధ్యయనం చేసి త్వరలో నివేదికను సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి డా.యోగితా రాణా, ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు, , జీఏడీ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






