- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt: ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొనాల్సిందే.. సర్క్యులర్ జారీ చేసిన సీఎస్
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్-2047 సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను (Telangana Rising 2047 Vision Document) రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు అని 8 ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇందులో ప్రజలను సైతం భాగస్వామ్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులంతా తెలంగాణ రైజింగ్ సర్వే-2047లో పాల్గొనాలని సీఎస్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 వరకు జరిగే ఆన్ లైన్ సర్వేలో ఉద్యోగులంతా తమ అభిప్రాయాలను తెలియజేయాలని సర్క్యులర్ జారీ చేశారు. https://www.telangana.gov.in/telanganarising/ లింక్ ద్వారా సర్వేలో పాల్గొనాలన్నారు.
Next Story






