New Year: కొత్త ఏడాదిలో మొదటి రోజు కిటకిటలాడిన ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2026-01-01 09:14:55  IST  )

న్యూ ఇయర్ సందర్భంగా ఆలయాలు, పర్యాటక ప్రదేశాలకు ప్రజలు పోటెత్తారు.

New Year: కొత్త ఏడాదిలో మొదటి రోజు కిటకిటలాడిన ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ 2026 (New Year 2026) సందర్భంగా దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ప్రజలతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని భక్తులు ఆయా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్‍లోని బిర్లామందర్ (Birla Mandir), జూబ్లీహిల్స్ టీటీడీ, పెద్దమ్మ తల్లి, బంజారాహిల్స్ లోని పూరీ జగన్నాథ, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్స్ చిలుకూరు బాలాజీ, సూరారం కట్టమైసమ్మ ఆలయాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఇక ప్రధాన చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జనవరి 1 హాలిడే కావడంతో పర్యాటకులు సందర్శనీయ ప్రదేశాలకు పోటెత్తారు. జూపార్క్ కు (Zoo Park), మాదాపూర్ లోని శిల్పారామం వద్ద పర్యాటకులతో సందడి నెలకొంది.

Next Story