- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయంలో కొత్త దిశగా పంట మార్పిడి.. అగ్రికల్చర్ వర్సిటీలో విస్తృత సదస్సు
ఈ నెల 4వ తేదీన రైతు సంఘాలు, అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విస్తృత స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పంట మార్పిడి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 4వ తేదీన రైతు సంఘాలు, అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విస్తృత స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రస్తుతం వ్యవసాయంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని అధిక దిగుబడి, ఉత్పత్తి అనే విధానంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి అనే విధానంతో వ్యవసాయ రంగం ముందుకు వెళ్లాల్సి ఉందని వివరించారు.
ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థకు పునాది పంటల మార్పిడే అని, వివిధ రసాయనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ పంటల మార్పిడిని ప్రోత్సహించడం పై రైతుల అభిప్రాయాలను సేకరించడం కోసమే ఈ సదస్సుని నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో రైతులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వెల్లడించిన సూచనలు, అభిప్రాయాలని క్రోడీకరించి పంట మార్పిడి ప్రోత్సాహానికి ఏ రకమైన విధానాలు రూపొందించాలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.






