SBI: ఎస్ బీఐ తెలుగు యాడ్స్ పై విమర్శలు.. అసలేం జరిగిందంటే?

by Prasad Jukanti |   (  Updated:2025-05-06 06:24:45  IST  )

మీ బ్యాంక్ గొప్పతనం కోసం ఇలా చేస్తారా అంటూ ఎస్ బీఐ తీరుపై ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

SBI: ఎస్ బీఐ తెలుగు యాడ్స్ పై  విమర్శలు.. అసలేం జరిగిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏ సంస్థ అయినా తన ప్రొడక్ట్ ను మార్కెటింగ్ చేసుకునేందుకు వాణిజ్య ప్రకటనలపై ఆధారపడుతుంటాయి. రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కంపెనీలు ఎత్తుగడలు వేస్తుంటాయి. అయితే ఇటీవల కొన్ని సంస్థల వాణిజ్య ప్రకటనలపై తెలుగు భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు కంపెనీల ప్రకటనల్లో వస్తున్న దోషాల తీరుపై మండిపడుతున్నారు. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) తెలుగులో దినపత్రికలకు ఇస్తున్న వాణిజ్య ప్రకటనలపై నెటిజన్ల ఆగ్రహానికి కారణం అవుతున్నది. ఆ బ్యాంక్ ఇస్తున్న ప్రకటనల్లో తెలుగు భాషా నవ్వులపాలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ బీఐ బ్యాంక్ ప్రకటనల తీరుపై ఓ నెటిజన్ స్పందిస్తూ మీ బ్యాంక్ గొప్పతనం చెప్పుకోవడం కోసం మా తెలుగు భాషను ఖూనీ చేయవద్దు. మీ ప్రకటనల్లోని దోషాలను మీ దృష్టికి తీసుకువస్తున్నా మీరు స్పందిచడం లేదు. మళఅలీ మళ్లీ తప్పులు చేస్తూ వరుసగా తెలుగు భాషకు అవమానం కలిగిస్తూనే ఉన్నారు. నాలుగు వరుసల్లో నాలుగు తప్పులు. ఇది తెలుగు బాషకు అవమానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారిని గుడ్డిగా నమ్మడం వల్లేనా?:

అయితే చాలా కంపెనీలు, సంస్థలు తమ వాణిజ్య ప్రకటనల కోసం యాడ్ ఏజెన్సీలు, అనువాదకులపై ఆధారపడుతున్నాయి. ఆ తర్వాత వారేం చెబితే అదే ఫైనల్ అనుకునే ధోరణిలో ఉంటున్నాయి. దీంతో అక్షరదోషాలు, అనువాదాల్లో క్షుద్ర సాహిత్యం పాఠకులను, భాషాభిమానుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరగుతోంది. ఇంగ్లీష్ ఆధిపత్యంతో రోజు రోజుకు తెలుగు మసకబారుతున్న ఇటువంటి తరుణంలో బాధ్యత తెలుగు గడ్డపై వ్యాపారాలు చేసుకుంటూ తెలుగు ప్రకటనల విషయంలో ఇదేం నిర్లక్ష్యం అని భాషాభిమానులు మండిపడుతున్నారు.

Next Story