అలుగు వర్షిణి నిర్ణయాలపై ఆరోపణలు.. సన్నిహితులైతే ఏమైనా ఇచ్చేస్తారా?

by Naga Rani Yarlagadda |

ఎస్సీ గురుకులం సొసైటీ లో అర్హత లేకున్నా, సన్నిహితులు అయితే చాలు సదరు అధికారులను అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అలుగు వర్షిణి నిర్ణయాలపై ఆరోపణలు.. సన్నిహితులైతే ఏమైనా ఇచ్చేస్తారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ గురుకులం సొసైటీ లో అర్హత లేకున్నా, సన్నిహితులు అయితే చాలు సదరు అధికారులను అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం సంస్థ రూల్స్ ను సైతం పక్కన పెట్టి, ఇష్టానుసారంగా అపాయింట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య సొసైటీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే అడషనల్ సెక్రటరీ (పైనాన్స్) పోస్టులో అనర్హులతో భర్తీ చేశారనే చర్చ సొసైటీ వర్గాల్లో జరుగుతున్నది.

సంస్థ రూల్స్ కు విరుద్ధం

సంస్థ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే అడషనల్ సెక్రటరీ(పైనాన్స్) పోస్టు చాలా కీలకం. గురుకులంలోని పిల్లలకు కావాల్సిన బట్టలు, షూ, బుక్స్, పప్పులు, మటన్, చికిన్, గుడ్లు, కూరగాయలతో పాటు ఇతర ఏ చిన్న అవసరమైనా ఫైనాన్స్ విభాగం టెండర్లు పిలుస్తుంటుంది. తక్కువ కోడ్ చేసిన సంస్థలను ఎంపిక చేస్తుంటుంది. అలాగే ఆ పనులు చేసే కాంట్రాక్ట్ సంస్థలకు రెగ్యులర్ గా బిల్స్ రిలీజ్ చేస్తుంటుంది. ఈ పనులు చేసేందుకు గతంలో ఫైనాన్స్ విభాగం లేదా ట్రెజరీ విభాగంలో పనిచేస్తున్న అధికారులను డిప్యూటేషన్ ద్వారా నియమించుకునే వారు. అయితే సెక్రటరీగా అలుగు వర్షిణి బాధ్యతలు చేపట్టిన తరువాత తనకు సన్నిహితురాలైన ఓ డిప్యూటీ రిజిస్ట్రర్ కు డిప్యూటేషన్ పద్దతిన (కో అపరేటివ్ విభాగం) ఫైనాన్స్ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆమె వెంటే ఆ అధికారిణి..

అలుగు వర్షిణీ ఎక్కడ పనిచేస్తే, సదరు ఆఫీసర్ సైతం అక్కడే డిప్యూటేషన్ పనిచేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. గతంలో టెస్కో (తెలంగాణ స్టేట్ కో‌‌–అపరేటివ్ సోసైటీస్) ఎండీగా వ్యవహరించినప్పుడు సదరు ఆఫీసర్ అక్కడే బాధ్యతలు నిర్వర్తించినట్లు టాక్. వర్షిణీ అక్కడి నుంచి గురుకులం సోసైటీకి బదిలీ అయిన వెంటనే, ఆ అధికారణి సైతం అక్కడ నుంచి డిప్యూటేషన్ పద్దతిన గురుకులంలోకి వచ్చారనే చర్చ జరుగుతున్నది. అయితే సదరు అఫీసర్.. సెక్రటరీ తనకు చాలా క్లోజ్ అనే సాకుతో సొసైటీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆమె పనితీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.

Next Story