- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నీ కల్పిత కథలు! ఐబొమ్మ రవి భార్య వ్యవహారంపై క్రైమ్స్ అడిషనల్ సీపీ కీలక వ్యాఖ్యలు
ఐబొమ్మ రవి భార్య వల్లే పట్టుబడినట్లు నడుస్తున్న ప్రచారం మొత్తం కల్పిత కథ అని క్రైమ్ అడిషనల్ సీపీ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి (Ibomma Ravi) రెండో విడత పోలీస్ కస్టడీ ముగిసిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగిన నిందితుడి మెయిల్స్ నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఈ మేరకు ఐబొమ్మ రవి విచారణ అంశాలపై క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాసులు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా చానెల్‌తో మట్లాడుతూ.. రెండోసారి కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఐబొమ్మ రవి పూర్తిగా సహకరించాడని తెలిపారు. ఎన్నో అంశాలు అతని నుంచి సేకరించినట్లు ఆయన తెలిపారు. పైరసీ విషయంలో వివిధ దేశాలకు చెందిన ఎక్స్‌పర్ట్స్‌ని రవి హైర్ చేసుకుని పైరసీ నెట్వర్క్ నడిపించాడని క్లారిటీ ఇచ్చారు. కరేబియన్ దీవులు కొందరు, సర్వర్ల విషయంలో స్విట్జర్లాండ్‌లో కొందరి సహకారం తీసుకున్నారని చెప్పారు. పోస్టుల డెవలప్ కోసం అఖిల్ అనే వ్యక్తిని హైర్ చేసినట్లు తెలిపారు. వారందరికీ డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.
అఖిల్ అనే వ్యక్తి గురించి ఇంకా దర్యాప్తు జరుగుతుందని, మొత్తం డేటా సేకరించిన తర్వాత ప్రసిక్యూషన్‌కి వెళ్తామని స్పష్టం చేశారు. రవి సంపాదించిన డబ్బుతో హైదరాబాద్, వైజాగ్ లో ఆస్తులు కూడబెట్టుకున్నాడని వెల్లడించారు. ఐబొమ్మ కరేబియన్ పౌరసత్వం తీసుకున్నారని, కరేబియన్ దీవుల్లో ఏదైనా ఆస్తుల గురించి చెప్పలేమని అన్నారు. ఎందుకంటే అక్కడ డేటా అంతా సిక్రేట్‌గా ఉంటుందని, డేటా అనేది రివీల్ చేయరని, ట్యాక్స్ ఎగ్గొట్టే వారు అక్కడే షెల్టర్ తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే అతనికి అక్కడ ఆస్తులు లేవని అతను చెప్పాడని అన్నారు.
అయితే, ఐబొమ్మ రవి భార్య వల్లే పట్టుబడినట్లు నడుస్తున్న ప్రచారం మొత్తం కల్పిత కథ అని క్రైమ్స్ అడిషనల్ సీపీ స్పష్టం చేశారు. ఆయన భార్య అతనికిగాని, తమకు గానీ టచ్‌లోకి రాలేదని అన్నారు. ఆమె సహకారంతోనే పట్టుకున్నామని ప్రచారం జరిగిందని, అది అంతా కల్పితం అని స్పష్టం చేశారు. ఐబొమ్మ రవి వేరే సోర్సెస్ ద్వారా తమకు పట్టుబడ్డారని అన్నారు. ఐబొమ్మ రవి మెయిల్స్ ద్వారా చాలా ఇన్ఫర్‌మెషన్ ఉందని, ప్రాసిక్యూషన్‌కు అదే హెల్ప్ అవుతుందని తెలిపారు.






