- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‍లో ఏఐ వార్ రూమ్..ఏఐ సమ్మిట్‍లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ జరుగుతున్న ఏఐ సమ్మిట్‍లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఏఐ కౌన్సిల్ అంశాన్ని ప్రస్తావించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‍గా ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ ఏఐ సమ్మిట్-2026 సదస్సులో ఇవాళ సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఏఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం అని చెప్పారు. హైదరాబాద్ లో ఏఐ వర్సిటీని ఇప్పటికే సకల వసతులతో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఆరు నెలలకోసారి హైదరాబాద్ వంటి ప్రదేశంలో ఐఏ సదస్సులు జరగాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరుతున్నానన్నారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలకు పిలుపునిచ్చారు.
అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలి:
ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిని భారత్ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. ఏఐలో స్టార్టప్ లను భారత్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలపై ప్రభావంచూపిస్తోందని వ్యవసాయరంగానికి ఏఐ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని సీఎంచెప్పారు. కొత్త ఆవిష్కరణలు మన జీవితాల్లో పెను మార్పులు తెస్తున్నాయన్నారు. కొత్త ఆవిష్కరణలతో మన జీవన విధానంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఏఐ ఫలితాలు మనం చూస్తున్నామన్నారు. ఏఐ శకం ఇప్పటికే మొదలైందని గతంలో పారిశ్రామి విప్లవం వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్ వేర్ విప్లవం నడుస్తోందన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు భారతీయులే సీఈవోలుగా ఉన్నారు.కానీ ఆ కంపెనీలు మనవి కావన్నారు.






