- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: నడిరోడ్డుపై పడుకుని మందుబాబు హంగామా
వనస్థలిపురంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక వ్యక్తి నడిరోడ్డుపై పడుకుని హంగామా చేశాడు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 కాగానే కేక్ కట్ చేసి, బాణసంచా కూడా కాల్చారు. ఒకరికొకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటూ సందడి చేశారు. మరి కొంతమంది యువత డిజే స్టెప్పులతో ఇరగదీశారు. అదే సమయంలో పీకల దాకా తాగిన మందుబాబులు రోడ్లపై చిందులు కూడా వేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికితే నాన రచ్చ చేశారు. ఈ నేపథ్యంలోనే వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వ్యక్తి నడిరోడ్డుపై పడుకునే హంగామా సృష్టించాడు. పోలీసులు తన పై చేయి చేసుకున్నారని, తాను మద్యం సేవించలేదని కూడా ఆరోపిస్తూ హల్చల్ చేశాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఆ ఆరోపణలను ఖండించి, వెంటనే సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి సివిల్ పోలీసులు వచ్చే సమయంలోపే, ఆ మందుబాబు పారిపోయాడు. దీంతో ఈ సంఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్లిక్






