- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుమ్మెర జాతరలో పసికందు హత్య.. సీపీఎం కీలక నిర్ణయం
నాగర్‌కర్నూలు జిల్లా కొమ్ముర గ్రామానికి ఘటనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూలు జిల్లా కొమ్ముర గ్రామానికి ఘటనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఎం(CPM Telangana) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రకటన విడుదల చేశారు. దళిత రజక కుటుంబం మీద అగ్రకులాలకు సంబంధించిన వారు ఆధిపత్య ధోరణితో మహిళలని కూడా చూడకుండా దేవాలయ ప్రవేశానికి అడ్డుకోవడంతో పాటు మహిళల మీద దాడి చేశారు. అడ్డుకున్న యువకుడిని మూడు గంటలు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల పసిపాపను తన్ని చంపేశారు. ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగితే పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించలేదు. పోలీస్ స్టేషన్‌కి వెళితే బాధితుల దరఖాస్తు తీసుకోకుండా, దాడి చేసినటువంటి వాళ్ళ దరఖాస్తు తీసుకొని బాధితుల మీద కేసులు నమోదు చేశారు.
హత్య కేసు నమోదు చేయాలి..
ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే జిల్లా డీఎస్పీ గానీ, ఎస్పీ గానీ, కలెక్టర్లు గానీ ఇప్పటివరకు స్పందించలేదు. దాడికి, హత్యకు పాల్పడినటువంటి వాళ్ళతో పాటు పసిబిడ్డను హత్య చేసినటువంటి నేపథ్యంలో వారందరి మీద సర్పంచుతో సహా మిగతా వాళ్ళందరి మీద హత్య కేసు నమోదు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి దాడి చేసినటువంటి వాళ్ళకు వంత పాడుతున్నారు. వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి ప్రత్యేక అధికారిని నియమించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని సీపీఎం నేత జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి..
అలాగే హోమ్ శాఖ మంత్రిగా ఉన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పటికైనా స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఐదారు రోజుల నుంచి నిరసనలు జిల్లా కేంద్రంలో జరుగుతున్నా ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. అందుకే దీన్ని నిరసిస్తూ వెంటనే వారి మీద హత్య కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నానని జాన్ వెస్లీ పేర్కొన్నారు.






