- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
John Wesley: ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తారా? రేవంత్ రెడ్డిపై సీపీఎం జాన్ వెస్లీ
హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట మారుస్తున్నారని సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) విమర్శించారు. ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు రేవంత్‌రెడ్డి వాగ్ధానాలు ఇచ్చారని అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రేవంత్‌రెడ్డికి తెలీదా? అని నిలదీశారు. హైదరాబాద్ లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ (M.A Baby) ఉగ్రవాదానికి సీపీఎం వ్యతిరేకం అని ఉగ్రవాదాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేయాలన్నారు. భారత్-పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణలో ఇతర దేశం మధ్యవర్తిత్వం అనవసరం అన్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆపరేష్ సిందూర్ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ ను ఆపడం శుభపరిణామం అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు అన్నారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.






