కుల దురహంకార హత్య అత్యంత కిరాతకం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

by Ajay Maddhiboyina |

కులాంతర వివాహానికి సిద్ధపడ్డారనే నెపంతో సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బీటెక్ విద్యార్థి యావన్‌ను దుండగులు అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేయడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.

కుల దురహంకార హత్య అత్యంత కిరాతకం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కులాంతర వివాహానికి సిద్ధపడ్డారనే నెపంతో సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బీటెక్ విద్యార్థి యావన్‌ను దుండగులు అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేయడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యావన్‌ను పక్కా పథకం ప్రకారం సభ్య సమాజం తలదించుకునే విధంగా వేటకొడవళ్లతో దాడి చేసి చంపడం దారుణమన్నారు. గత రెండు నెలలుగా రెక్కీ నిర్వహించి, పాత వాహనాలు, సిమ్ కార్డులు సేకరించి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడం దుర్మార్గమని, కులం, మతం పేరుతో జరుగుతున్న ఇటువంటి ‘కులదురహంకార హత్యల’పై సమాజంలో చైతన్యం తేవడానికి, కులాంతర వివాహాల రక్షణకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర నడిబొడ్డున ఇలాంటి దాడులు జరగడం శోచనీయమన్నారు. తక్షణమే నిందితులందరినీ అరెస్ట్ చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story