- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారి మృతిపై సీపీఎం సంతాపం.. సీఎం రేవంత్ ఎదుట కీలక డిమాండ్
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల దళిత చిన్నారి అనుమానాస్పద మృతిపై సీపీఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల దళిత చిన్నారి అనుమానాస్పద మృతిపై సీపీఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ(CPIM John Wesley) స్పందించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘చిన్నారి మృతి అత్యంత విషాదకరం. చిన్నారి మృతిపట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తోంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ ఘటనపై స్పందించి చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి.
విధుల్లోంచి తొలగించాలి..
కుమ్మెర కొండపై ఉన్న ఆలయాన్ని కొందరు పెత్తందారులు తమ గుప్పిట్లో ఉంచుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. కుల వివక్షతో దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలో చిన్నారి తల్లి కీర్తి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా, దాడి చేసిన పెత్తందారులు ఇచ్చిన ఫిర్యాదునే ముందుగా పరిగణనలోకి తీసుకోవడం వారి కుల వివక్షా పూరిత వైఖరిని స్పష్టం చేస్తోంది. చివరకు ప్రజాసంఘాల పోరాటం తర్వాత నిన్న సాయంత్రం కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో మహిళలు, సామాజిక న్యాయం ప్రశ్నార్థకంగా మారాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన ఎస్‌ఐ మరియు ఇతర సిబ్బందిపై విచారణ జరిపి విధుల్లోంచి తొలగించాలని, తన తల్లి, తమ్ముడిని కొట్టిన నిందితుల నుండి బాధిత పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చిన్నారి మృతికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేసి, హత్య కేసులు నమోదు చేయాలి. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.






