- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CPM: బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి మద్దతుగా సీపీఎం ఛలో గవర్నర్ కార్యక్రమం
రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను (BC Reservation Bill) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. కేంద్రం వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాలని, 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ఛలో గవర్నర్ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, బీసీ వర్గాలకు, సామాజిక శక్తులకు, సంస్థలకు, వ్యక్తులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ ఆమోదిస్తూనే కేంద్రంలో మాత్రం అడ్డుకుంటుదన్నారు. ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్‌కు, రాష్ట్రపతికి పంపితే ఉద్దేశ్యపూర్వకంగానే ఎలాంటి ఉత్తర్వులు రాకుండా, బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని విమర్శించారు. దీని ఫలితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పరంగా సుప్రీం కోర్టులో పోరాడుతూనే, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వంపై పోరాడితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చిన బీసీ జేఏసీ నేతలు, కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిస్తే జయప్రదానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు






