- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ ప్రజలపై దాడిని వ్యతిరేకించిన సీపీఐ నారాయణ
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పాకిస్తాన్ గత 12 రోజులుగా పీఓకే వద్ద కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం (War atmosphere) నెలకొంది. ఈ క్రమంలో పాకిస్తాన్ గత 12 రోజులుగా పీఓకే వద్ద కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. దీంతో భారత్ దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు ప్రధాని మోడీ భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి సమయంలో భారత్ పాకిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేసింది. మొత్తం 9 ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని నిమిషాల వ్యవధిలోనే ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ దాడిలో మొత్తం 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఆ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు, ప్రముఖులు స్పందిస్తూ మద్దతుగా నిలిచారు.
ఇందులో భాగంగానే సీపీఐ నారాయణ (CPI Narayana) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా దాడిపై ఆయన మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ దాడిలో ఉగ్రవాదులపై భారత ఆర్మీ జరిపిన దాడికి మద్దతు (దాడికి మద్దతు తె) తెలుపుతూనే.. పాకిస్తాన్ ప్రజలపై దాడి చేయడాన్ని ఖండించారు. తాము పాకిస్తాన్ పై యుద్దం చేయడానికి వ్యతిరేకం అని సీపీఐ నారాయణ తేల్చి చెప్పారు. అలాగే ఉగ్రవాదులను హతమార్చడానికే భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుందని, పాక్ పై యుద్ధం చేయడానికి కాదని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులను చంపడం న్యాయమే.. పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల నిర్మూలనలో భారత దేశానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ పోరు ఉగ్రవాదంపై మాత్రమే ఉండాలని, పాక్ పౌరులు, ప్రభుత్వంపై కాదని, అలా చేస్తే ఉగ్రవాదం మరింత బలోపేతమవుతుందని CPI నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: పాకిస్థాన్‌పై దాడి కాదు.. యుద్ధం చేయాలి : ఎమ్మెల్యే రాజాసింగ్






