- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యుద్ధం పాకిస్తాన్ ప్రజల మీద కాదు.. మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: మన యుద్ధం పాకిస్తాన్ ప్రజల మీద.. పాకిస్తాన్ మీద కాదు.. టెర్రరిజం పైన అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన సీపీఐ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. బార్డర్‌లో వీర మరణం పొందిన తెలుగు జవాన్ కుటుంబానికి నారాయణ సంతాపం తెలియజేశారు. (Pakistan) పాకిస్తాన్‌లో సామాన్య జనాలకు ఇబ్బందులు కలిగించకూడదని నారాయణ చెప్పారు. ఇలా కామెంట్ చేసినందుకు పాకిస్తాన్ ఏజెంట్ అంటూ తనపై విరుచుకుపడ్డారని మండిపడ్డారు. కానీ నా ఉద్దేశం అర్థం చేసుకోలేదన్నారు. టర్కీ తప్పితే ఎవ్వరు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయడం లేదని, ప్రపంచం మొత్తం భారత్‌కి అండగా నిలుస్తున్నారని, పాకిస్తాన్ ఒంటరి అయిపోయిందని చెప్పుకొచ్చారు. పాక్‌కు చైనా సపోర్ట్ చేస్తుందనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆడపిల్ల కన్నీరు ఊరికే పోదని, పహల్గాం ఉగ్రదాడిలో కాళ్ల పారాణి ఆరకముందే భార్య ముందర భర్తను చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. (Indian Army) ఇండియన్ ఆర్మీ, ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా టెర్రరిస్టుల క్యాంపుల మీద దాడి చేశారని కొనియాడారు. టెర్రరిస్టులను మట్టుబెట్టడంలో ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు.
అందాల పోటీలతో ఏమి సందేశం ఇస్తున్నారు?
తెలంగాణలో అందాల పోటీలు (Miss World) నిర్వహిస్తున్నారని, ఈ పోటీలు ఏమి చెప్పదలుచుకుందని ప్రశ్నించారు. ఈ పోటీలతో రాష్ట్రం ఏమి సందేశం ఇస్తుందని నిలదీశారు. అధికారులు (Sophia Qureshi.. Vyomika Singh) సోఫియా ఖురేషి.. వ్యోమికా సింగ్ లాంటి వాళ్ళు కదా మనకి ఆదర్శమన్నారు. ఈ సుందరీమణులు ఎవరికి ఆదర్శమని మండిపడ్డారు. టూరిస్ట్ ప్లేసులో సుందరీమణులు ఊరేగిస్తామని అంటున్నారని, బిగ్‌బాస్ ప్రొగ్రామ్ లాంటిదే ఇది కూడా అని ఫైర్ అయ్యారు. అందాల పోటీలు నిర్వహించడం అంటే భారతీయ సంస్కృతిని అవమానించడమని, ఇది స్త్రీ జాతికి అవమానమని చెప్పారు. ఆడవాళ్ళ అందాలను ప్రదర్శించి వ్యాపారాలు చేస్తారా? అని నిలదీశారు. మగవాళ్లకు కూడా అందాల పోటీలు పెట్టి.. వ్యాపారం చేసుకోండని ప్రభుత్వానికి సూచించారు.