రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించండి.. సీఎంకు సీపీఐ చాడ వెంకట్ రెడ్డి లేఖ

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ 2024 నుండి నేటికి దాదాపు 21 నెలల నుంచి పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించండి.. సీఎంకు సీపీఐ చాడ వెంకట్ రెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ 2024 నుండి నేటికి దాదాపు 21 నెలల నుంచి పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి గురువారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి 2024 నుండి నేటికి దాదాపు 21 నెలలగా పదవీ విరమణ బకాయిలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నారని, చివరి దశలో ఉద్యోగంలో జమ చేసిన డబ్బులు ఇవ్వకపోవడంతో వృద్దాప్యంలో ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. చాలా మందికి వారి పిల్లల పెండ్లీలు, ఇతర శుభకార్యాలు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. పదవీ విరమణ పొందిన వారికి వెంటనే వారి బకాయిలు ఇప్పించాలని కోరారు.

Next Story