- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా.. పది వార్డులు కూడా..
సర్పంచ్ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా.. పది వార్డులు కూడా..

దిశ, వెబ్‌డెస్క్/దుమ్ముగూడెం: తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు తొలి విడత ఎన్నికలు జరుగగా.. 2 గంటల నుంచి ఫలితాలు వెల్లడిస్తున్నారు. చాలా చోట్ల అధికార కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్లు బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు కూడా గెలుపొందుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఓ చోట ఎర్రజెండా రెపరెపలాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రామారావుపేట పంచాయతీలో ఎన్నికల్లో సీపీఎం ఘన విజయం సాధించింది. మొత్తం పది వార్డుల్లో ఎక్కువ వార్డుల్లో సీపీఎం అభ్యర్థులు గెలుపొందారు. కొన్ని స్థానాల్లో ఇరువైపులా గట్టి పోటీ నెలకొనడంతో ఫలితాలు చివరి నిమిషం వరకు ఉత్కంఠను రేకెత్తించాయి. ప్రత్యేకంగా 6వ వార్డు ఎన్నిక తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు పోలవడంతో టై ఏర్పడింది. నిబంధనల ప్రకారం అధికారులు లక్కీ డ్రా నిర్వహిచంగా కాంగ్రెస్ అభ్యర్థికి అదృష్టం వరించింది. పంచాయతీ స్థాయిలో కూడా ఇరువైపులా సమాన వార్డులు రావడంతో ఉప సర్పంచ్ పదవికి మళ్లీ లక్కీ డ్రా నిర్వహించగా సీపీఎం అభ్యర్థికి అదృష్టం వరించింది.






