MLC కవిత పోరాటానికి CPIM తెలంగాణ మద్దతు

by Gantepaka Srikanth |

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆవరణలో మహాత్మ జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule) విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటానికి సీపీఐఎం పార్టీ(CPIM Telangana) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

MLC కవిత పోరాటానికి CPIM తెలంగాణ మద్దతు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆవరణలో మహాత్మ జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule) విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటానికి సీపీఐఎం పార్టీ(CPIM Telangana) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామని అన్నారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయింది.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్(EWS Reservation) అమలుతో తొమ్మిది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. కాబట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని కోరారు.

తక్షణమే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కుల గణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బహిర్గతం చేయాలన్నారు. అనంతరం సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన అభినందనీయమన్నారు. తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కవిత పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కుల అసమానతలను నిర్మూలించకుండా దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లదని మా నమ్మకమని చెప్పారు.

కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలను బహిర్గతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

Next Story