- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CPIM తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ కీలక పిలుపు
CPIM తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ కీలక పిలుపు

దిశ, తెలంగాణ బ్యూరో: మనువాదం అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహయోధుడు జోతిబా పూలే ఆశయ సాధన కృషిలో భాగంగా సామాజిక న్యాయ పోరాటాల్లో సమైక్యంగా పాల్గొనాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జ్యోతిభా పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ అసమానతల వ్యతిరేక పోరాటంలో భాగంగా పాఠశాలలు పెట్టి అతిశూద్రులు, మహిళలు, అస్పృశ్యులకు చదువును నిషేధిస్తే పూలే ప్రత్యేక పాఠశాలలు పెట్టి చదువుకునే అవకాశం కల్పించడం గొప్ప విషయం అన్నారు. సామాజిక మార్పునకు చదువు మార్గం ఏర్పడిందన్నారు. తన భార్యను టీచర్ గా తీర్చిదిద్ది విద్యావ్యాప్తి చేశాడని చెప్పారు. పాఠశాలలు నడిపే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించారనీ చెప్పారు. అనేక సామాజిక ఉద్యమాల్లో భాగంగా డాక్టర్ బీఆర్.అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా జ్యోతిబాపూలేని గురువుగా స్వీకరించారని ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపేటట్టుగా రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానులేనని ప్రకటించిందని చెప్పారు.
రాజ్యాంగంలో కొన్ని హక్కుల్ని కల్పించడంలో బాగంగాబీసీలకు అన్ని పార్టీలు 42శాతం రిజర్వేషన్ల ఆమోదం తెలిపితే శాసనసభ ద్వారా కేంద్రానికి పంపించినప్పటికీ బిజెపి అడ్డుకుంటుందని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్స్ కు, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీజేపీ విధానం ఉందన్నారు. దోపిడీ కొనసాగించడానికి బీజేపీకి కార్పొరేట్ల ప్రయోజనాల చుట్టు ప్రభుత్వవిధానాలు తిప్పుతుందన్నారు. సామాజిక న్యాయం సాధించాలన్న జ్యోతిబాపూలే డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని చెప్పారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్న బీజేపీ అభ్యర్థులను ఓడించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, టి.సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు, వివిధ ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు కోట రమేష్, భూపతి వెంకటేశ్వర్లు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






