John Wesley: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి సరికాదు

by Gantepaka Srikanth |

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

John Wesley: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి సరికాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 30 మంది రామరాజ్య స్థాపన అనే సంస్థ ముసుగులో దౌర్జన్యం చేయడంతో పాటు, పరుష పదజాలంతో దూషిస్తూ భౌతిక దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. రంగరాజన్‌ గతంలో ఓ దళితుడిని ఆధ్యాత్మిక గురువుగా తీర్చిదిద్ది అదే దేవాలయంలో అర్చకుడిగా నియమించడం, కుల అసమానతలు ఉండకూడదని ఆయన ఆకాంక్షించారని, దీన్ని ఓర్వలేక వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదులు దాడికి తెగబడ్డారన్నారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుందన్నారు.

Next Story