తెలంగాణ ప్రజలకు CPIM సెక్రటరీ ధన్యవాదాలు

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రజలకు CPIM సెక్రటరీ ధన్యవాదాలు

తెలంగాణ ప్రజలకు CPIM సెక్రటరీ ధన్యవాదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్పంచ్ ఎన్నికల్లో సీపీఐఎం మద్దతు ఇచ్చి.. అభ్యర్ధులను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పార్టీ తరపున విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డులు సభ్యులకు అభినందనలు తెలిపారు. డబ్బు, మద్యం, రకరకాల ప్రభావాలు విచ్చలవిడిగా పనిచేస్తున్న ఈ ఎన్నికల్లో 19 జిల్లాల్లో 91 మంది సర్పంచ్‌లు, 124 ఉపసర్పంచ్‌లు, 1300 వార్డులకు పైగా వార్డు మెంబర్స్‌ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. గెలుపొందిన అభ్యర్ధులు గ్రామ అభివృద్ధికోసం, ప్రజలకు అండగా నిలబడుతూ సమస్యలు పరిష్కారం చేసే విధంగా పనిచేస్తూ, ప్రజా ప్రతినిధులుగా ఆదర్శవంతమైన పాత్ర నిర్వహించాలని సూచించారు.

Next Story