- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పని చేయకపోతే బీఆర్ఎస్ అంతరించిపోవడం ఖాయం.. CPIM నేత జాన్ వెస్లీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) రాసిన లేఖ తీవ్ర దుమారం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) రాసిన లేఖ తీవ్ర దుమారం రేపింది. పార్టీలో కోవర్టులు ఉన్నారని.. వాళ్లంతా స్వయంగా మీ చుట్టే ఉన్నారని తండ్రి కేసీఆర్(KCR)కు రాసిన లేఖలో పేర్కొంది. వాళ్లను ముందే గుర్తించి దూరం పెడితేనే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించింది. అయితే.. కవిత లేఖపై రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఆ కోవర్టులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేస్తుండగా.. బీజేపీ నేతలు అదంతా ఓ డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై సీపీఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్పందించారు. శనివారం నాగర్‌కర్నూలులో పర్యటించిన ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడారు. కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీపై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలని అన్నారు. ప్రాంతీయ పార్టీలను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోంది. మతోన్మాద రాజకీయాలను పెంచి పోషిస్తోంది. బీజేపీతో సానుకూలంగా ఉంటే బీఆర్ఎస్ అంతరించిపోయే అవకాశం ఉంటుందని కేసీఆర్‌కు జాన్ వెస్లీ సూచించారు.






