- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరాచీ బేకరీపై దాడిని ఖండిస్తున్నాం: CPIM తెలంగాణ
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కరాచీ బేకరిపై మతోన్మాద అరాచక శక్తులు దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కరాచీ బేకరిపై మతోన్మాద అరాచక శక్తులు దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశం మీద జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా కుల, మతాలకు అతీతంగా దేశం ఐక్యంగా నిలబడి, సైన్యానికి మద్దతుగా నిలబడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి చర్యలు అనైక్యతకు దారితీస్తాయన్నారు. దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ కరాచీ నుంచి వచ్చినటువంటి హిందువుల కుటుంబం అదే కరాచీ పేరుతోనే సంవత్సరాల తరబడి దేశవ్యాపితంగా బేకరీలను నడిపిస్తున్నదన్నారు. కాగా, కొందరు మతోన్మాదులు పాకిస్తాన్ నగరం పేరు ఉండకూడదని ఈ అరాచకానికి పాల్పడడం శోచనీయం అన్నారు. ఇలాంటి చర్యలకు అవకాశం ఇవ్వకుండా నిందితులపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తున్నదన్నారు.






