CPIM అభ్యర్థికి 500 ఓట్ల భారీ మెజారిటీ

by Gantepaka Srikanth |

CPIM అభ్యర్థికి 500 ఓట్ల భారీ మెజారిటీ

CPIM అభ్యర్థికి 500 ఓట్ల భారీ మెజారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికల్లో సీపీఐఎం అభ్యర్థి ఘన విజయం సాధించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గ్రామ సర్పంచ్‌గా సీపీఐఎం అభ్యర్థి బొంతల చంద్రారెడ్డికి 500ల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో గ్రామంలో వామపక్ష శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రామారావుపేట పంచాయతీలోనూ సీపీఎం ఘన విజయం సాధించింది. మొత్తం పది వార్డుల్లో ఎక్కువ వార్డుల్లో సీపీఎం అభ్యర్థులు గెలుపొందారు. కొన్ని స్థానాల్లో ఇరువైపులా గట్టి పోటీ నెలకొనడంతో ఫలితాలు చివరి నిమిషం వరకు ఉత్కంఠను రేకెత్తించాయి. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు పోలవడంతో టై ఏర్పడింది. నిబంధనల ప్రకారం అధికారులు లక్కీ డ్రా నిర్వహిచంగా సీపీఎం అభ్యర్థికి అదృష్టం వరించింది.

Next Story