- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని లేఖ
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సమ్మెలో ఉన్న ఆర్టిజన్ కార్మికులపై ఎస్మా, డిస్మిస్, మెమో లాంటి బెదిరింపు ధోరణితో ఇబ్బందులకు గురి చేయకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కారానికి వారితో చర్చలు జరిపి పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సమ్మెలో ఉన్న ఆర్టిజన్ కార్మికులపై ఎస్మా, డిస్మిస్, మెమో లాంటి బెదిరింపు ధోరణితో ఇబ్బందులకు గురి చేయకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కారానికి వారితో చర్చలు జరిపి పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ‘తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు రంగంలో 18 వేల మందికి పైగా ఆర్టిజన్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ వంటి విభాగాల్లో ఉన్నారు. వీరందరూ గత మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. చట్టబద్ధంగా సమ్మె నోటీసు ఇచ్చి కాలపరిమితి ప్రకారం అధికారులు స్పందించకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె చేస్తున్న కార్మికులను ఎస్మా, డిస్మిస్, మెమో లాంటి బెదిరింపు ధోరణితో ఇబ్బందులకు గురి చేయకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్చల ద్వారా పరిష్కరించాలి. గత ప్రభుత్వం ఆర్టిజన్ అనే పేరుతో కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేసే విధంగా చట్టం చేసి గత పది సంవత్సరాలుగా వేతనాలు ఇవ్వడంలో పదోన్నతులను కల్పించడంలో విద్యార్హతలను బట్టి సముచిత స్థానం ఇవ్వకుండా ఎదుగు బొదుగు లేకుండా ఉన్న స్థానంలోనే ఉంచుతున్నారు. కష్టం చేస్తున్నవారికి వేతనాలు, పదోన్నతులు లేకుండా చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో కార్మికుల సమ్మెతో ఉత్పత్తి పై ప్రభావం పడుతుంది. కావున ఈ పరిస్థితిలలో పట్టింపులకు వెళ్ళకుండా ఆర్డిజెన్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్‌ను పరిష్కరించి, సమ్మెను విరమింప చేయాలి’ అని సాంబశివరావు లేఖను వివరించారు.






