సజ్జనార్ పద్ధతి మార్చుకోవాలి.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఉండొచ్చు.. సీపీఐ కూనంనేని సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-08-28 09:52:29  IST  )

ఆర్టీసీని కాపాడుకోవడం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం అవుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.

సజ్జనార్ పద్ధతి మార్చుకోవాలి.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఉండొచ్చు.. సీపీఐ కూనంనేని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (RTC) ఆర్టీసీని కాపాడుకోవడం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం అవుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని సీపీఐ పార్టీ ఆఫీస్ ముఖ్దూమ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. (Sajjanar) సజ్జనార్ ముఖ్యమంత్రినా..? మంత్రినా..? ఎండీ నా..? అని కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికుల పట్ల ఆయన ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, సజ్జనార్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. సజ్జనార్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఉండవచ్చు, కానీ అట్లాంటి భయానక వాతావరణం ఆర్టీసీ కార్మికుల పట్ల సృష్టించడం సరైంది కాదని మండిపడ్డారు. కార్మికుల పట్ల సజ్జనార్ పద్ధతి మార్చుకోక పోతే సజ్జనార్‌పై ప్రత్యేక ఉద్యమాలు రూపొందించాల్సి వస్తుందని సజ్జనార్‌కు గుర్తు చేస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం

సీపీఐ 4 వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ముగిశాయని కూనంనేని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, రైతాంగ సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. పేదల ఇండ్లను కూల్చడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. 11 నుంచి 17 వరకు తెలంగాణ వారోత్సవాలు జరుపుతామని అన్నారు. డిసెంబర్ 26 న కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సంబురాల సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సాయుధ పోరాట త్యాగాల్ని, ప్రభుత్వం గుర్తించాలని, సాయుధ వారోత్సవాలను జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఈ నెల 30న సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ రవీంద్రభారతిలో ఉంటుందని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ సీపీఎం పార్టీలు కలిసొచ్చిన చోట కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పొత్తు లేని చోట ఒంటరిగా బరిలో నిలుస్తామని క్లారిటీ ఇచ్చారు.

Next Story