కవిత సస్పెండ్.. బీజేపీకి దూరంగా ఉంటేనే మంచిది.. ప్రాంతీయ పార్టీలకు సీపీఐ నారాయణ హెచ్చరిక

by Ramesh Naini |   (  Updated:2025-09-02 13:42:34  IST  )

భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలకు అభయహస్తం కాదని, భస్మాసుర హస్తమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ విమర్శించారు.

కవిత సస్పెండ్.. బీజేపీకి దూరంగా ఉంటేనే మంచిది.. ప్రాంతీయ పార్టీలకు సీపీఐ నారాయణ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాంతీయ పార్టీలకు అభయహస్తం కాదని, భస్మాసుర హస్తమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ (CPI Narayana) విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తెలంగాణలో (BRS) బీఆర్ఎస్ ఉదాహరణగా తీసుకుంటే, బీజేపీ (BJP) దగ్గర కావడం వల్లే ఆ పార్టీలో చీలికలు వచ్చాయని నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సస్పెన్షన్, పార్టీ విభజనకు బీజేపీనే కారణమని ఆరోపించారు. అన్నాడీఎంకే (తమిళనాడు), శివసేన – ఎన్‌సీపీ (మహారాష్ట్ర) పార్టీల విషయంలో కూడా బీజేపీ ఇదే తరహా ధోరణి ప్రదర్శించిందని గుర్తు చేశారు. బీజేపీ దగ్గరైన ప్రతీ పార్టీ చివరికి కనుమరుగైపోతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ భస్మాసుర హస్తం చంద్రబాబుతో సహా అందరికీ వర్తిస్తుందని నారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా బీజేపీకి దూరంగా ఉంటేనే మంచిదని ప్రాంతీయ పార్టీలకు నారాయణ సూచించారు.

Read More..

Kavitha: కవిత సస్పెండ్.. తెరపైకి లిక్కర్ స్కామ్!

Next Story