- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బీజేపీతో సావాసం మంచిది కాదు’.. కేసీఆర్‌కు CPI నారాయణ సూచన
బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం(KCR Family)పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం(KCR Family)పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మాటలతో తేలిందని అన్నారు. ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరంపై తప్పకుండా సమగ్ర విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తులు పెట్టుకుంటూ.. కుటుంబాలకు కుటుంబాలను చీల్చుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్, తమిళనాడు, మహారాష్ట్రలోనూ ఈ విధంగా బీజేపీ కుటుంబాలను చీల్చుకుంటూ వస్తోందని అన్నారు. లిక్కర్ కేసు అంటూ కల్వకుంట్ల కవితను జైల్లో పెట్టారు.. చివరకు కవిత కుటుంబం నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకునేంత వరకు వచ్చిందని అన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నిక(Election of Vice President)ల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదంటే బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉన్నట్లే అని చెప్పారు. అనంతరం సీపీఐ తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్సీ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బీజేపీ - బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని అన్నారు. ప్రజలను, గులాబీ శ్రేణులను గందరగోళ పరచకుండా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు ఎవరికి వేస్తుందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నమ్ముకుంటే బీఆర్ఎస్ భవిష్యత్ దెబ్బతింటుందని అన్నారు. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలాగా బీఆర్ఎస్ వ్యవహరించొద్దని.. బీజేపీ పార్టీ మంచిది కాదని హితవు పలికారు. తప్పకుండా కాళేశ్వరం అవినీతిపై పారదర్శక విచారణ జరగాలని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి చేపట్టాలని డిమాండ్ చేశారు.






