- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వానికి మేము చెప్తే వింటారా! రాజకీయాలు మిత్ర బంధాలు వేరు.. సీపీఐ నారాయణ
భూముల విషయంలో ప్రభుత్వానికి మేము చెప్తే వింటారా? మా మాట వింటారా? మేము మా అభిప్రాయం చెప్తాం.. అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భూముల విషయంలో ప్రభుత్వానికి మేము చెప్తే వింటారా? మా మాట వింటారా? మేము మా అభిప్రాయం చెప్తాం.. అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు మిత్ర బంధాలు వేరు.. ప్రస్తుత హెచ్‌సీయూ భూముల సమస్య వేరు అని చెప్పారు. రాజకీయాల్లో ఎవరికి ఎవరు శాశ్వత మిత్రులు కాదు.. శాశ్వత శత్రువులు కాదని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో (HCU) హెచ్‌సీయూకు భూములు కేటాయించారని వివరించారు. భూముల ధరలు పెరగడంతో అందరి కన్ను సెంట్రల్ యూనివర్సిటీ భూముల పై పడిందన్నారు.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆస్పత్రి యాజమాన్యం అక్కడ ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే విద్య వ్యవస్థకే ఆ భూములని అప్పట్లోనే మేము స్పష్టం చేశామని గుర్తుకు చేశారు. విద్య వ్యవస్థ విస్తృతికి ఈ భూములను ఉపయోగించాలని నారాయణ కోరారు. జనం పెరుగుతుంది కానీ, భూమి పెరగదు కదా, ప్రభుత్వ భూములు అమ్మ కూడదన్నారు. గత ప్రభుత్వాలు భుములు అమ్మారు అంటున్నారు.. వాళ్ళు ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్నారు కదా.. చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఈ భూములు వచ్చాయి.. (CM Revanth Reddy) రేవంత్ రెడ్డికి భూములు ఇవ్వలేదు.. అని నారాయణ వివరించారు. ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల విషయంలో పునరాలోచించాలని, వెంటనే ఈ భూముల జోలికి పోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీ భూములను వ్యాపార వస్తువుగా చూడొద్దన్నారు. విద్యార్థులను కొడుతుంటే.. (HCU land auction) భూముల అమ్మే ప్రయత్నం చేస్తే ఊరుకుంటామా? అని నిలదీశారు. వక్ఫ్ బిల్ పై నారాయణ మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లుకు ఆమోదం రావడంతో లౌకిక వ్యవస్థకు చీకటి రోజులు వచ్చాయని అన్నారు. రెండు సభలను బుల్డోజ్ చేశారని, రాజ్యాంగానికి ఏం విలువ ఉందని మండిపడ్డారు. పార్లమెంటులో బిల్లు అయినప్పటికీ కూడా బయట మా ఆందోళనలు కొనసాగుతాయని ఫైర్ అయ్యారు.






