ఇలా దోపిడీ చేస్తే IBOMMA రవి లాంటివాళ్లు పుడూతూనే ఉంటారు.. సీపీఐ నారాయణ వార్నింగ్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-12 15:07:09  IST  )

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇవ్వ‌డంపై సీపీఐ నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.సినిమా టికెట్ వెయ్యి పెట్టి కొంటే థియేట‌ర్ లో నీళ్లు తాగినా, కూల్ డ్రింక్ తాగినా మ‌రో వెయ్యి ఖ‌ర్చు అవుతుంద‌ని అన్నారు. ఇలా దోపిడీని ప్రోత్స‌హిస్తూనే ఉంటే ఐబొమ్మ ర‌వి లాంటివాళ్లు పుడుతూనే ఉంటార‌ని అన్నారు.

ఇలా దోపిడీ చేస్తే IBOMMA రవి లాంటివాళ్లు పుడూతూనే ఉంటారు.. సీపీఐ నారాయణ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇవ్వ‌డంపై సీపీఐ నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓవైపు ఐబొమ్మ ర‌విని పైర‌సీ సినిమాల కేసులో జైలులో పెట్టి వేధిస్తున్నార‌ని అన్నారు. మ‌రోవైపు సినిమా టికెట్ ధ‌ర‌లు వేల‌కు వేలు పెంచ‌డానికి అనుమ‌తిస్తున్నార‌ని మండిప‌డ్డారు. నిర్మాత‌లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే సామాన్య ప్ర‌జల‌మీద భారం వేస్తున్నార‌ని అన్నారు. సినిమా టికెట్ వెయ్యి పెట్టి కొంటే థియేట‌ర్ లో నీళ్లు తాగినా, కూల్ డ్రింక్ తాగినా మ‌రో వెయ్యి ఖ‌ర్చు అవుతుంద‌ని అన్నారు.

మీరు ఇలా దోపిడీని ప్రోత్స‌హిస్తూనే ఉంటే ఐబొమ్మ ర‌వి లాంటివాళ్లు పుడుతూనే ఉంటార‌ని అన్నారు. సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచితే ఐబొమ్మ ర‌వి లాంటివాళ్ల‌ను మీరు ఆప‌లేర‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకుని ప్ర‌భుత్వాలు సినిమాల జోలికి వెళ్ల‌కుండా ఉండాల‌న్నారు. వాళ్ల‌కు ఎక్కువ‌గా రాయితీలు ఇవ్వాల్సిన అవ‌స‌రంలేద‌ని అన్నారు. టికెట్ ధ‌ర‌లు అస‌లు పెంచాల్సిన అవ‌స‌రం లేద‌ని మండిప‌డ్డారు. ఇదిలా ఉంటే సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలకు ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తున్నాయి. దీంతో ప్రీమియర్ షో టికెట్ ధరలు ఏకంగా ఐదు వందల నుండి వెయ్యి వరకు ఉంటున్నాయి.

Next Story