- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CPI Narayana: చెన్నమనేని రమేశ్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాలి.. సీపీఐ నారాయణ డిమాండ్
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh)పై దేశ ద్రోహం కేసు పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ (CPI Narayana) డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత పౌరసత్వం లేకుండా ఎన్నికలలో పోటీ చేసిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh)పై దేశ ద్రోహం కేసు పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ (CPI Narayana) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియోలో మాట్లాడారు. భారత పౌరసత్వం లేకుండా పలు దఫాలుగా వేములవాడకు శాసనసభ్యులు ఎన్నికయ్యారని, కేంద్ర ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను మోసం చేశారని నారాయణ తెలిపారు. ఎమ్మెల్యేగా ఉంటూ పలుకుబడిని ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు అనుభవించారని ఆయన ఆరోపించారు. రమేశ్ పౌరుడు కాదని తేల్చి చెప్పిన కోర్టు, కేసు వేసిన ఆది శ్రీనివాస్‌కు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 25 లక్షలు ఇవ్వాలని తీర్పునిచ్చిందని, అలాగే తను అనుభవించిన ప్రభుత్వ జీతమంతా మొత్తం తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పదవిని ఉపయోగించుకొని మోసం చేసి సంపాదించిన ఆస్తులకు ఆయనకు శిక్ష విధించాలని, దీనిపై తాము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని నారాయణ వెల్లడించారు.






