సనాతన ధర్మంలో విడాకులే లేవు.. పవన్‌పై మరోసారి విరుచుకుపడ్డ సీపీఐ నారాయణ

by Ajay Maddhiboyina |

పవన్ కల్యాణ్ పై సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్ధించే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అ

సనాతన ధర్మంలో విడాకులే లేవు.. పవన్‌పై మరోసారి విరుచుకుపడ్డ సీపీఐ నారాయణ
X

దిశ‌, వెబ్ డెస్క్:పవన్ కల్యాణ్ పై సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్ధించే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది అంటూ మండిపడ్డారు. ఎవరు దానిని సమర్ధించినా వాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంలో అసలు విడాకులు ఉండవని అన్నారు. అలాంటప్పుడు పవన్ కల్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని ప్రశ్నించారు.

సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలని అంటున్నాడని, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని తాను చెబుతున్నానని అన్నారు. సనాతన ధర్మంలో భర్త చనిపోతే అతడితోనే భార్యను తగలబెట్టడం లాంటి ఆచారాలు ఉన్నాయని అన్నారు. అలాంటి ధర్మాన్ని పాటించడం అంటే మళ్లీ వెనక్కి వెళ్లడమే అని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడిన తరవాత తాను పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడలేదని అన్నారు. ఆయన విడాకులు తీసుకునే పెళ్లి చేసుకున్నారని చెప్పారు. కానీ అసలు సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా అనేది తన మాటల సారాంశం అని చెప్పారు. సనాతన ధర్మంలో అసలు విడాకులే లేవన్నారు.

Next Story