- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నదీ జలాల సమస్య కోర్టులో పరిష్కారం కాదు: సీపీఐ నారాయణ
ఏపీ, తెలంగాణ నదీ జలాల వివాదంపై సీపీఎం నేత నారాయణ కీలక వ్యాక్యలు చేశారు. నదీ జలాల వ్యవహారాన్ని మీరే తేల్చుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించిందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ, తెలంగాణ నదీ జలాల వివాదంపై సీపీఎం నేత నారాయణ కీలక వ్యాక్యలు చేశారు. నదీ జలాల వ్యవహారాన్ని మీరే తేల్చుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించిందన్నారు. నదీ జలాల వ్యవహారం అనేది కోర్టులో తేలదని అన్నారు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నేషనల్ పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఒక గదిలో కూర్చుని చర్చించుకోవాలన్నారు. కోర్టులకు వెళితే సమస్య పరిష్కారం కాకుండా సాగదీస్తూనే ఉంటారని చెప్పారు. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాలుగు గోడల మధ్య కూర్చుని సమస్య పరిష్కరించుకోవాలని అన్నారు. ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా తెలుగు ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని నదీ జలాల సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరం అయితే నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్నది కూడా తెలుగు ప్రజలేనని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల కోసం ఓపికగా బహిరంగ స్టేట్మెంట్లు ఇవ్వకుండా పరిష్కరించుకోవాలన్నారు. లేదంటే ఈ సమస్య పరిష్కారం అవ్వదు అని వ్యాఖ్యానించారు.






