- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.. CPI ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు
ప్రజా సమస్యలపై ఎక్కడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని సీపీఐ ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సమస్యలపై ఎక్కడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని సీపీఐ ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం అన్నారు. శాసన మండలిలో కమ్యూనిస్టు పార్టీ విలువలతో ప్రజల సమస్యలపై గొంతుకగా నిలుస్తానని సత్యం పేర్కొన్నారు. సోమవారం శాసన మండలిలో ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతాంగం, కార్మికుల సమస్యలపై గొంతు వినిపిస్తానని చెప్పారు. ఇక ప్రజల సమస్యలే నా ఎజెండా అని అన్నారు. తాత్కాలికంగా కమ్యూనిస్టు పార్టీ చట్టసభల్లో బలహీనంగా ఉన్నా.. ప్రజలు, రైతులు, కార్మికుల పక్షంగా విద్యార్థుల పరంగా అనేక సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
రాజకీయలు, చట్టల సభలలో బలహీనపడ్డా రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా మళ్లీ కమ్యూనిస్టు పార్టీలను ఆదరిస్తారని పేర్కొన్నారు. ఇవాళ ప్రజల పక్షాన చట్టసభల్లో మాట్లాడే వారు కమ్యూనిస్టు పార్టీల వారేనన్నారు. కాంగ్రెస్మద్దతుతో గెలిచిన కూడా ప్రజల పక్షాన నిలబడుతామన్నారు. పదేండ్లు బీఆర్ఎస్ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగించిందన్నారు. ఆ రకమైనన పాలనకు కాంగ్రెస్సాహసం చేయదని, ఆ దిశగా ప్రయత్నం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడే వారంతా గాలిలో కొట్టుకుపోయారన్నారు. అనేక ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీలు ముందుండి నడిపించారని అన్నారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు యోధులు అనుసరించిన విధానాలలతో ముందుకెళుతూనే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి, ప్రజాసమ్యలపై నిరాంతం పోరాటం చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సత్యం స్పష్టం చేశారు.






