- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై విద్యార్థుల అరెస్ట్.. తక్షణమే విడుదల చేయాలి : సీపీఐ ఎమ్మెల్సీ డిమాండ్
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను నిర్బంధించారని CPI MLC నెల్లికంటి సత్యం తీవ్రంగా ఖండించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను నిర్బంధించారని CPI MLC నెల్లికంటి సత్యం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్పందిస్తూనే ఉంటారని, అదేవిధంగా మారేడుమిల్లి ఎన్ కౌంటర్ పై వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కోసం వారు ముందుగానే మావోయిస్టులకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి బహిరంగంగానే లేఖలు రాశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వారు వెళుతున్న వాహనాలను ఆపి విద్యార్థులను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించారని, అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, మారేడుమిల్లిలో ఈ నెల 18న జరిగిన ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ కోసం వెళ్తున్న ఓయూ, కేయూ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థుల బృందాన్ని ఏపీ పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఇటీవల హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో, దానిపై నిజ నిర్ధారణ చేసే ఉద్దేశంతో విద్యార్థులు ఆ ప్రాంతాలను పరిశీలించడానికి ప్రయత్నించారు. కానీ విద్యార్థులు చింతూరు ప్రాంతానికి చేరుకోగానే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. చింతూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా, పోలీసులు ఆ విద్యార్థులను అరెస్ట్ చేసి, చింతూరు స్టేషన్‌కు తరలించారు.






