CPI MLA: అసెంబ్లీలో చర్చ పెట్టి చేతులు దులుపుకోవద్దు

by Gantepaka Srikanth |

కులగణనపై అసెంబ్లీలో చర్చ పెట్టి చేతులు దులుపుకోవద్దని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు.

CPI MLA: అసెంబ్లీలో చర్చ పెట్టి చేతులు దులుపుకోవద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కులగణనపై అసెంబ్లీలో చర్చ పెట్టి చేతులు దులుపుకోవద్దని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. సర్వేను సభలో పెట్టడంపై ఉద్దేశం ఏంటో చెప్పాలన్నారు. సుమారుగా 3 లక్షలకు పైగా కుటుంబాలు సర్వేలు పాల్గొనలేదని.. ప్రభుత్వం ఏదైనా పనిచేస్తే విమర్శలు రావడం సాధారణం అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే సూచనలు ఇస్తే మంచిదని సూచించారు. కులగణన జాబితాను గ్రామాల వారీగా ఏర్పాటు చేసి.. మిగిలిపోయిన వారి పేర్లను నమోదు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రీ సర్వే చేయాలంటే అది ఎప్పటికీ అయిపోదని.. 2014 సర్వేతో ఈ సర్వేను పోల్చకూడదని కోరారు. ఒక్క రోజులో హడావిడి చేసిన సర్వేకు.. ఈ సర్వేకు చాలా తేడా ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్లు ఎంత పెంచుతారో వెల్లడించాలని.. లేదంటే ఈ సర్వే కాగితాలకే పరిమితం అవుతుందని చెప్పారు. ఎంత పెంచినా ప్రాక్టికల్‌గా ఉండాలన్నారు.

Next Story